మెట్టుగూడా డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలో సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలుపుతామని నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాసూరి సునీత పాల్గొన్నారు.