శ్రీకాళహస్తిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం, బేరివారి మండపం వద్ద, గాంధీ వీధి, ఓటేరు కాలువ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో విశేష పూజలు జరిగాయి. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ వేద పండితులు మంత్రోచ్ఛారణలతో భారీ వినాయక విగ్రహాలకు హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.