శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని రహమత్ నగర్ కు చెందిన అష్రఫ్ అలీ ఖాన్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలో సుధాకర్ నాయుడు అనే వ్యక్తి ఓ బ్యాంకులో తన పేరు మీద ఓ ఖాతాను తెరిపించి ఆ ఖాతా ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇతరులతో డబ్బులు వేయించుకున్నాడు. తన ఖాతాలో ఉన్న నగదును అతడి సొంత ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇలా మూడు లక్షల 95 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకోగా దీనిపై అతన్ని ప్రశ్నించినందుకు తనను బెదిరించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.