పాము కాటుకు గురై మహిళ మృతి బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనికెళ్లిన సంపూర్ణమ్మ (47) పాము కాటుకు గురై మృతి చెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా భర్తకు మతిస్థిమితం లేదు. కూలి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సంపూర్ణమ్మ మరణంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.