నరసన్నపేట మండలం జమ్మూ వద్ద సాగునీటిని మెరక ప్రాంతానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. దీంతో శివారు భూములలో ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం సాగునీటికి అడ్డుకట్ట వేయడంతో దూకలపాడు, సత్యవరం ప్రాంత రైతులు నీటిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే తొలగించాలంటూ నీటి సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు కోరుతూ సాగునీరును అడ్డుకోవద్దు అని కోరారు.