వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి డిఎస్పీ జయసూర్య ఆదేశాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు భీమవరం టూ టౌన్ సిఐ కాళీ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంకాలం 6 గంటలకు పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదని అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.