ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం ఒకటేనని ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా చూడాలన్నారు.