రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అధికారులు శనివారం ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామంలో ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు. రోడ్లపై పారిశుద్ధ్య చర్యలు, చెత్త తొలగింపు చేపట్టారు.