అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మక విజయమని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంతిభవనంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.