ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ పరిధిలోని పోలీసులకు మరియు సిబ్బందికి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హెల్మెట్లు, టోపీలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఇటీవల ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు దృష్టికి రావడంతో పోలీసుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చేతుల మీదుగా పోలీసులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.