యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జైన పల్లి లో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు వెళ్ళింది. ఈ సందర్భంగా బుధవారం తెలిసిన వివరాల ప్రకారం కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే సహాయం చేసి వారిద్దరిని సురక్షితంగా బయటికి తీసినట్లు తెలిపారు .వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.