రాయచోటి పట్టణంలోని రెడ్డిస్ కాలనీలో ఉన్న రామాలయం వద్ద అగ్రగామినే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో రూ.1,93,000 రూపాయలకు మద్దిరేవుల రెడ్డి శేఖర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డు ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మద్దిరేవుల రెడ్డి శేఖర్ రెడ్డి ని అగ్రగామినే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అభినందించి సన్మానించారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య వినాయక లడ్డు ను మద్దిరేవుల రెడ్డిశేఖర్ రెడ్డి ఊరేగింపుగా తన నివాసానికి తీసుకెళ్లారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో వినాయక విగ్రహం వద్ద మహిళలు కుంకుమార్చన, స