పల్నాడు జిల్లా,నరసరావుపేటలో రైతు పోరుబాట లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటగంట సమయంలో స్థానిక ఆర్డీఒకి మాజీ మంత్రి విడదల రజనీ, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం,అధికారులు యూరియా ఉందంటున్నారు,కానీ క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందటం లేదన్నారు.బ్లాక్ మార్కెట్ కు వెళ్లే యూరియా ను అరికట్టి,పారదర్శంగా ప్రతి రైతు కి యూరియా అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.