ఆళ్లగడ్డలో పోలీసులు మొహరించారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ వదిలి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్టాండు, పాతూరు వీధి శివాలయం వద్ద పోలీస్ పికెట్తో పాటు సుబ్బారెడ్డి స్వగృహం వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.