నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పీఏ పల్లి మండల కేంద్రంలోని జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలలో బుధవారం ఎమ్మెల్యే బాలు నాయక్ విస్తృతంగా అధికారులతో కలిసి పర్యటించారు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. పీఏపల్లి మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ పీపుల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.