పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం 12 గం సమయంలో ఉట్కూరు మండలం పెద్ద జట్రం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల పక్కనే ఒక చిన్న రేకుల షెడ్డులో మధ్యాహ్న భోజనానికి వంట వండుతుండటం చూసి కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారని వారికి ఇంత చిన్న షెడ్డులో అపరిశుభ్రత మధ్య వంట వండడం ఏమిటని పాఠశాల హెచ్ఎం ను కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే వంట గది తో పాటు పాఠశాల ఆవరణను శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు.