కుబీర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సోమవారం భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను, పెండింగ్ లో ఉన్న పాత కేసుల వివరాలను పరిశీలించారు. సీసీటీవీల నిఘా, గ్రామాల్లో బస్తీ పెట్రోలింగ్ చేపట్టాలని కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డికి వివరించారు. సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం వంటి అంశాలపై సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు.