అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలకు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . ఆదివారం అనపర్తిలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.