విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే పునాది అని, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శనీయులని రచయిత గోపాలశర్మ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెండున్నరకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడేనని కొనియాడారు. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుందని సంగీత శిక్షకులు పిప్పళ్ల ప్రసాద్ అన్నారు. ఈ వృత్తి ఎంతో పవిత్రమైనదని అభిప్రాయపడ్డారు.