ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం లోని ప్రకాశం భవనం ఎదురుగా వున్న అన్నా క్యాంటిన్ ను గురువారం రాత్రి జేసి గోపాల కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజన ఏర్పాట్లను పరిశీలించి పేద వారు భోజనం చేసే అన్నా క్యాంటిన్ ప్రదేశం మరియు పరిసరాలు శుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడుతూ మీరు ఏమి పని చేస్తున్నారు, భోజనం ఎట్లా వున్నది తదితర వివరాలను ఆరా తీసారు. ఆవరణలో పారిశుద్ధ్యం, ప్లేట్ లు వేడినీళ్ళతో శుభ్రం చేయడం, ఆహార నాణ్యత ఉండేలా చూడాలని, ఎటువంటి ఫిర్యాదులకు అవకాశం లేకుండా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు