జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు సారీ చెప్పించాలని నంద్యాల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. ఆదివారం దగ్గుబాటి ఇల్లు, ఆఫీస్ ముట్టడికి నంద్యాల నుంచి తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు పామిడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభిమానులు పోలీసులు, ప్రభుత్వం పామ తీరుపై మండిపడ్డారు.