గతం మూడు రోజులు కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన రోడ్డను కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి పరిశీలించారు కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు ధ్వంసమైన విషయం తెలుసుకొని రోడ్డును పరిశీలించారు. పాల్వంచ మండలం బండ రామేశ్వర పల్లి గ్రామం నుండి చుక్కాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జి ద్వంసమైన విషయం తెలుసుకొని రోడ్డును పరిశీలించారు. బిబిపేట మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద తెగిన రహదారి చేస్తున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు పూర్తిచేయలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.