హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బ్లడ్ బ్యాంక్ కాలనీలో జలమండలి అధికారులతో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్పందించిన కార్పొరేటర్ కాలనీలో వెంటనే భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ అన్నారు.