ములుగు జీపీ నుంచి మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో కార్మికులకు జీవో 60 ప్రకారం రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ ములుగు జిల్లా కార్యదర్శి రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఆదివారం రోజున జరిగిన మున్సిపల్ వర్కర్స్/ఎంప్లాయిస్ యూనియన్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్.సుదర్శన్, ప్రధాన కార్య దర్శిగా మాట్ల జయాకర్, కోశాధికారిగా కావటి భాస్కర్ ఎంపికయ్యారు.