బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాటపటిమతో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. సమాజహితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి,వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి,వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు.