టీచర్ కొట్టిందని టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన విద్యార్థిని. తాడువాయి మండలం మేడారం ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కాక సాయి ప్రసన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది. క్లాసులో అందరి ముందు హిందీ టీచర్ దుర్భాషలాడుతూ, విచక్షణరహితంగా కొట్టడంతో అవమానం భరించలేక టాబ్లెట్స్ మింగింది. దీంతో ఆమెను ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అకారణంగా తన కూతురిపై దుర్భాషలాడుతూ కొట్టిందని తల్లిదండ్రులు నేడు మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.