శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 175 వసతి గృహాల్లో 12 వేల మందికి పైగా బాలికలు ఉన్నారని, వారందరికీ సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు జిల్లా ప్రసూతి స్త్రీ వైద్య నిపుణుల సంఘం ముందుకు రావడం శుభ పరిణామామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్న బాలికలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ తో కలిసి శానిటరీ న్నాఫిన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సుమారు 170 మంది గైనిక్ వైద్యులు ఉన్నారని వారందరూ ఒక సంఘముగా ఏర్పడి రానున్న3నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో బాలికలకు ఉచిత వైద్యం