ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం రెబ్బెన మండలం నేర్పల్లి గ్రామ పంచాయతీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరు పట్టిక,తరగతి గదులు,మధ్యాహ్న భోజనం నాణ్యత,నిత్యవసర సరుకులు,పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా ఉపాధ్యాయులు ప్రతిరోజు సమీక్షించాలని, గైర్హాజరు అయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు క్రమం తప్పకుండా విద్యార్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.