కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలం గంగాయపల్లి గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు..ఆర్టీసీ హెయిర్ బస్సు బైక్ ను ఢీ కొన్న ఘటనలో పల్లపు ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి కాలు తెగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ సొంత పనిమీద కలసపాడుకు వచ్చి తిరుగుప్రయాణంలో బైక్ పై ఇంటికి వెళ్తుండగా గంగాయపల్లి గ్రామం సమీపంలో మైదుకూరు డిపోకు హెయిర్ బస్సు ఢీకొట్టింది. ప్రశాంత్ కుమార్ కుడి కాలు పై బస్సు టైర్ ఎక్కడంతో కాలు తెగి పక్కన పడిపోయింది.