గుత్తి లోని ఆర్ఎస్ రోడ్డులో శ్రీ సాయి డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు అడ్డంగా ఎనుము రావడంతో దాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గుత్తి చెర్లో పల్లి కాలనీకి చెందిన అంబులెన్స్ డ్రైవర్ ప్రభాకర్, ఆర్ఎస్ కు చెందిన విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.