భక్తులు వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, అలాగే మండపముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం చేసే సమయంలో చిన్న పిల్లలను చెరువు దగ్గరకు రానీయకుండా దూరంగా ఉంచాలని సూచించారు. నిమజ్జనానికి వెళ్లే వాహనాల డ్రైవర్లకు లైసెన్స్ తప్పకుండా ఉండాలని, అలాగే వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలన్నారు.