చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు నరహరి శర్మ శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 10 గంటలకు గ్రహణం ప్రారంభమై ఒంటిగంటకు ముగుస్తుందని పేర్కొన్నారు. గర్భిణులు, వృద్ధులు, బాలలు సాయత్రం 5 గంటల లోపు భోజనం చేయాలని సూచించారు.