టీడీపీ పార్టీ వారికి తప్ప ఇతరులు ఎవరికీ ముఖ్యంగా వైయస్సార్సీపీ వారికి సంక్షేమ పథకాలు ఇవ్వవద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని, నేనే గవర్నర్ అయి ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి పనికి రాదని రాసే వాడినని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఘాటుగా విమర్శించారు. కళ్యాణదుర్గం లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ ముఖ్యమంత్రి అయినా నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెబుతారా అని ప్రశ్నించారు. జనాలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు.