మామిడికుదురు లో మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారానికి 70 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ నెలాఖరుకు మరో వంద టన్నులు దిగుమతి అవుతుందన్నారు. యూరియా లభ్యత పై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.