మెట్పల్లి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది మెట్పల్లి పట్టణంలో శనివారం ఉదయం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఆదివారం ఉదయంతో ప్రశాంతంగా ముగిసిందని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సహకరించిన పట్టణ ప్రజలకు, ఆర్డీఓ శ్రీనివాస్, తహశీల్దార్ నీత, డీఎస్పీ రాములు, సీఐ అనిల్, ఎస్ఐ కిరణ్ కుమార్, మున్సిపల్ సిబ్బందికి, అన్ని శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.