ఈనెల 14 15 తేదీలలో జిల్లాలో జరగనున్న తొలి మహిళ సాధికారతపై పార్లమెంటరీ శాసనసభ కమిటీల జాతీయ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులు పోలీసు విభాగం ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య మున్సిపల్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పరిశీలించారు సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విధులను నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.