మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం సమీపంలోని భీముని పాదం జలపాతం వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. పెద్దలు, పిల్లలు జలపాతం నుంచి వచ్చే నీళ్లలో ఆటలాడుతూ కేరింతలు కొట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులతో భీముని పాదం జాతరను తలపించింది. అయితే, పర్యాటకులనుండి ఎంట్రీ ఫీజు వసూలు చేసినప్పటికీ, కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పర్యాటకులు వాపోతున్నారు.