రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టిఏ కార్యాలయంలో సేవలు సోమవారం పంపించాయి. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను అధికారులు తొలగించడంతో ఆర్టిఏ కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో వందల సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్న దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు కాగా రేపటి నుంచి సేవలను తిరిగి పునరుద్ధరించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.