ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని నాళాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత కాలనీలు వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు పారుతున్నాయి. పలుచోట్ల కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హ్యాండీక్యాప్డ్ కాలనీలో పలు ఇంట్లో వరద నీరు చేరింది.