పాలకూర సమీపంలో అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా పడిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల పోలీసుల కథనం మేరకు పూతలపట్టు మండలంలోని బెంగళూరు తిరుపతి సిక్స్ లైన్ హైవే పాలకూరు సమీపంలో ఐచర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇరువురిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.