రాయదుర్గం మండలంలోని ఆయుతపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానేష్ అనే 9 ఏళ్ల బాలుడు చెరువులో పడి మృతి చెందాడు. శుక్రవారం మద్యాహ్నం మరో బాలుడితో కలసి చెరువు సమీపంలో బహిర్బూమికి వెళ్లాడు. నీటితో కడుక్కోవడానికి చెరువులో వెళ్లి కాలుజారి పడిపోయాడు. మరో బాలుడు గ్రామంలోకి వచ్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన వెళ్లి ఆ బాలుడిని నీటినుండి వెలికితీసి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మానేష్ గుమ్మగట్ట మండల ఎస్. కొత్తపల్లి గ్రామానికి చెందిన జయమ్మ, మల్లయ్య దంపతుల పెద్ద కుమారుడు. ఆయుతపల్లి లోని అమ్మమ్మ దగ్గర