కడప జిల్లా ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకటక్రిష్ణారెడ్డి ఆదివారం రైతులకు పలు విషయాలు ప్రకటన ద్వారా తెలిపారు.పియం కిసాన్ లబ్ది పొందే ప్రతి రైతు కూడా తప్పకుండా రైతు రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో మున్ముందు వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే ప్రతి పథకం కూడా పారదర్శకంగా పొందుటకు రైతు రిజిస్ట్రీ ద్వారా పొందే విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు..పియం కిసాన్ లబ్ది పొందే రైతులు ఈకేవైసి కాకుండా పెండింగ్ ఉంటే అటువంటి రైతులు ఈకేవైసి చేయించుకోవాలన్నారు.