ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం గణేష్ విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది 45వ డివిజన్ మారుతీ నగర్ కు చెందిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకుపోయే క్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భారీ డీజే లతో పోలీసు నిబంధనలను అతిక్రమించారు దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వారిని వారించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే అక్కడ యువకులు మాత్రం తిరిగి పోలీసులపై దాడికి పూనుకున్నారు పోలీసులను నెట్టివేస్తూ హడావుడి హల్చల్ చేశారు దీంతో ఆ యువకులపై కేసు నమోదు చేసిన ఒంగోలు తాలూకా పోలీసులు యువకులను హాజరపలిచారు.