సంచారజాతుల స్వతంత్ర దినోత్సవ వేడుకల కరపత్రాన్ని భీమవరంలో సంచారజాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం 1871లో అమలు చేసిన క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ వల్ల సంచారజాతులు అన్యాయానికి గురయ్యారని, 1952 ఆగస్టు 31న వారికి విముక్తి లభించిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 31న సంచారజాతుల స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే భీమవరం వీరమ్మ పార్కు సమీపంలో ఆగస్టు 30న ఉభయగోదావరి జిల్లాల సంయుక్త సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.