కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్ ను ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి సందర్శించినట్లు శనివారం నాయకులు తెలిపారు.ముద్దనూరు మండలం ఉప్పలూరు వైసీపీ నాయకుడు విశ్వనాధ్ రెడ్డి అన్న కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన విషయం తెలుసుకుని జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని వారిని పరామర్శించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.