నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలోని మదర్ మోడల్ పాఠశాలలో ఇంటర్ జోన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో 160 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఫయాజ్ తెలిపారు.