ఆలమూరు మండలం, మూలస్థానం వద్ద నూతనంగా నిర్మించిన కాజ్ వే వరద ఉధృతికి కొట్టుకుపోయింది. శుక్రవారం వరద పోటెత్తడంతో 21 తూరలతో నిర్మించిన ఈ కాజ్ వే పూర్తిగా వరదనీటి తాకిడికి మక్కలుముక్కలుగా విడిపోయి తూరలన్నీ కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కాజ్ వే ప్రాంతాన్ని కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరిశీలించి తోకలంక ప్రజలు రాకపోకలు సాగించేందుకు నాలుగు పడవలు ఏర్పాటు చేశారు