వినాయక చవితి పర్వదినాన్ని కరీంనగర్ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య మత సామరస్యాన్ని పటిస్తూ ఘనంగా జరుపుకోవాలని కరీంనగర్ టూ టౌన్ సిఐ సుజన్ రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు రామ్ నగర్, గోదాం గడ్డ, కాశ్మీర్ గడ్డ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉంచాలన్నారు. మండపాల వద్ద టపాకాయలు, పేలుడు సామాగ్రి ఉండరాదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు.