అమలాపురం విద్యుత్ నగర్ వద్ద స్థానిక నివాసి కుడిపూడి ఏసుబాబు ఇంట్లో త్రాచు పాము హల్చల్ చేసింది. ఇంట్లోకి చొరబడిన త్రాచుపాము ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనలకు గురైన స్నేక్ క్యాచర్ జంపన గణేష్ వర్మకు సమాచారం అందించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకొని డబ్బాలో బంధించి జనావాసం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.