నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో స్వర్ణ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండుకోవడంతో గురువారం దిగువకు నీటిని విడుదల చేసారు. స్వర్ణ వాగు, గోదావరి నది ఉదృతంగా ప్రవహించడంతో సోన్ మండలంలోని జాఫ్రాపూర్, మాదాపూర్ బ్రిడ్జిలు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. సోన్ గోదావరి పుష్కర ఘాట్ దగ్గర నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.